Amaravati Farmers will Protest Over Andhra Pradesh Capital

ఆంధప్రదేశ్‍ రాజధాని కోసం ఉదారంగా భూములిచ్చిన తమ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేయొద్దని అమరావతి రైతులు, రైతు కూలీలు కోరారు. రాజధాని ప్రాంత రైతుకలు అన్యాయం చేయకూడదన్న ఆలోచన ఉంటే ప్రభుత్వ పెద్దలు తుళ్లూరు వచ్చి తమ గోడు వినాలని కోరారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో ఆదివారం (208వ రోజు) నిరసనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, దొండపాడు, అనంతవరం, రాయపూడి, వెలగపూడి, వెంటకపాలెం, పెదపరిమి, మల్కాపురం తదితర గ్రామాల్లో రైతులు మహిళలు ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించారు.