Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఒకే రోజు 2వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 10.86 శాతం మందికి కొవిడ్‍ 19 పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. ఈ 24 గంటల వ్యవధిలో 1,933 మంది ఈ మహమ్మారిన బారిన పడగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం కొవిడ్‍ కేసుల సంఖ్య 29,168కు, మరణాలు 328కు చేరాయి.