Donald Trump wears face mask for the first time

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం 11 జూలై తొలిసారిగా బహిరంగంగా మాస్క్ ధరించారు. ఆయన వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ సందర్శన సందర్భంగా అధ్యక్ష ముద్రతో ఉన్న మాస్క్ ధరించారు.

ట్రంప్ శ్రేయోభిలాషులు అమెరికాలో పెరుగుతున్న కరోనా వైరస్ దృష్ట్యా అమెరికా ప్రజలకు మాస్క్ ధరించటానికి ఒక ప్రేరణగా ఉంటుంది అని విజ్ఞప్తి చేసిన తరువాత ట్రంప్ మాస్క్ ని ధరించారు మిలిటరీ మెడికల్ సెంటర్ల లో ట్రంప్ గాయపడిన దళాలను పలకరించటానికి వెళ్లగా ఆయన చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మరియు ఇతరులు కూడా మాస్క్ ధరించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాస్క్ ధరిస్తారా లేదా అని చాలా ఊహాగానాలు వచ్చాయి ఎందుకు అంటే ఎన్ని సారులు ట్రంప్ సలహాదారులు మాస్క్ ధరించమని చెప్పినా ట్రంప్ వాటిని తిప్పికొట్టారు. ఎందుకుఅంటే మాస్క్ ధరిస్తే ప్రజలు నను బలహీనుడిగా భావిస్తారు, ప్రజారోగ్య సంక్షోభం బదులుగా అమెరికా ఆర్ధికంగా నిలదొక్కుకుంటుంది అనే సంకేతం ప్రజలలోకి వెళ్ళాలి అందుకు ఇళాచైయక తప్పదు అని ట్రంప్ భావన అని ట్రంప్ కార్యాలయం తెలుపుతూ వచ్చింది మరియు అధ్యక్షుడు ట్రంప్ మిచిగాన్ లోని ఫోర్డ్ ప్లాంట్ని, ఫీనిక్స్ లో ని కరోనావైరస్ టెస్టింగ్ మరియు ఉత్పత్తి చేసే కర్మాగారం కి వెళ్ళినప్పుడు, అలాగే హనీవెల్ మాస్క్ ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు మాస్క్ ధరించకపోవటం ఊహాగానాలకు దారితీసాయి. కరోనా వైరస్ అమెరికాలో రిపబ్లికన్ ఓటర్ల ఉన్న రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో వ్యాపించడంతో, అధ్యక్షుడు ట్రంప్ మిలిటరీ మెడికల్ సెంటర్ కేంద్ర సందర్శనలో మాస్క్ ధరించాలని యోచిస్తున్నట్లు అన్నారు అని విలేఖరులు అభిప్రాయపడ్డారు.

“నేను ప్రజల సమూహంలో ఉంటే మరియు ప్రజలకి దగ్గరగా ఉన్నపుడు మాస్క్ ధరిస్తాను. మనం ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ప్రత్యేకించి ప్రత్యేకమైన నేపధ్యంలో ఉన్నప్పుడు ఉదాహరణకి చాలా మంది సైనికులు మరియు వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మాస్క్ ధరించడం గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను , నేను ఎప్పుడూ మాస్క్ ధరించటానికి వ్యతిరేకంగా లేను, కాని మాస్క్ ధరించటానికి సమయం సందర్భం ఉంటుంది అని నేను నమ్ముతున్నాను.” అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.