Esha Deol quashes rumours of Hema Malini being hospitalised

ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టినా, ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే మాట వినిపిస్తోంది. కరోనా...కరోనా కోవిడ్ 19, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే కరోనాపై కుప్పలు తెప్పలుగా ఫేక్ న్యూస్ కనిపిస్తున్నాయి. భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకూ రాకెట్ లా దూసుకుపోవడంతో సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదు కావడం వందల్లో మరణాలు సంభవించడం వంటి విపత్కర పరిస్థితిలో ఇవి చాలనట్టుగా.. కొందరు సెలెబ్రిటీలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. సెలెబ్రిటీలకు కరోనా సోకిందనే రూమర్లను వ్యాప్తి చేస్తున్నారు.

ఎవర్ గ్రీన్ స్టార్ హేమమాలిని గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న విపత్కర పరిస్థితిలో హేమమాలినికి కరోనా సోకిందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. హేమమాలిని ఆస్పత్రిలో చేరడంతో ఈ వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి.

హేమమాలిని కూతురు ఈషా డియోలో ఆ రూమర్లను ఖండించింది. తన అమ్మ క్షేమంగా, ఆరోగ్యంగా ఉందని, దయచేసి ఆ రూమర్లను నమ్మకండని చెప్పుకొచ్చింది. ఎవ్వరూ ఆందోళన చెందకండని, తమపై అభిమానం చూపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపింది.

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై హేమమాలిని సైతం స్పందించింది. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ రూమర్లను ఖండించింది. ‘మీరు చూపించిన ప్రేమకు థ్యాంక్స్. ఆ కృష్ణ పరమాత్ముడి దయ వల్ల నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాధే రాధే.. మీ అందరూ ఇంటి పట్టునే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండ’ని కోరింది.

బాలీవుడ్‌పై కరోనా పంజా విసురుతోంది. స్టార్ సెలెబ్రిటీల ఇంట్లోనో, వారి సిబ్బంధికో ఎవరికో ఒకరికి కరోనా సోకుతోంది. నేడు బచ్చన్ ఫ్యామిలీ మొత్తం (జయా బచ్చన్ మినహా) కరోనా బారిన పడగా.. అనుపమ్ ఖేర్ కుటుంబం సైతం కరోనాతో ఆస్పత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది..