Anupam Kher s Family Members Test COVID 19 Positive

రిషికపూర్, ఇర్ఫాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్ మరణాల నుంచి ఇంకా కోలుకోలేని బాలీవుడ్‌ ని ఇప్పుడు కరోనా వైరస్ తో కుదిపేస్తోంది. బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది. జయ బచ్చన్ మినహా అమితాబ్, అభిషేక్,‌ ఐశ్వర్య, ఆరాధ్య లకు కరోనా సోకింది., అమితాబ్, అభిషేక్ లు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఐశ్వర్య ఆరాధ్యలు సెల్ఫ్ హోమ్ కంటెయిన్మెంట్ లో వుంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

అదే విధంగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. ఇంట్లో అందరికీ పాజిటివ్ వచ్చిందని, తనకు మాత్రం నెగెటివ్ వచ్చిందని అనుపమ్ ఖేర్ తాజాగా ఓ వీడియో ద్వారా అందరికీ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌లో ఇప్పటికే బచ్చన్ ఫ్యామిలీలో కరోనా విజృంభించగా.. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఇంట్లోనూ కరోనా కోరలు చాచింది. అనుపమ్ ఖేర్ తన తల్లి ఆకలి వేయడం లేదని చెప్పిన తరువాత డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడట. అక్కడ అన్నీ పరీక్షలతో పాటు కోవిడ్ టెస్ట్‌లు కూడా చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరూ నిర్ఘాంతపోయారట. దీంతో కుటుంబ సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారట.అనుపమ్ ఖేర్ సోదరుడు రాజు ఖేర్, ఆయన భార్యకు, కోడలికి అందరికీ కరోనా వచ్చినట్టుగా ప్రకటించాడు. అయితే తనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని అనుపమ్ ఖేర్ ప్రకటించాడు.

దీంతో ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.పైన ఫోటీలో రెడ్ సర్కిల్ లో వున్నా ‘మా అమ్మను, అన్నను ,వదినను, పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని కోకిలా బెన్ హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. నాకు నెగెటివ్ వచ్చింది. బీఎంసీకి సమాచారం ఇచ్చాం’ అని అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

మరో పక్క యువ నటుడు రంజన్ సెహగల్ శనివారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ యువ నటుడు చంఢీగడ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. యువ హీరో మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.యువ నటుడు రంజన్ సెహగల్ టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితులు. పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన మంచి ప్రేక్షకాదరణ ఉంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, రణదీప్ హుడా నటించిన సరబ్‌జిత్ చిత్రం రంజన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన వయసు 36 సంవత్సరాలు. రంజన్ మృ‌తితో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ విధంగా బాలీవుడ్ కి పుండు మీద కారం చల్లినట్లుంది పరిస్థితి..