Decision on monsoon session of Parliament soon

క‌రోనా తో దేశం అట్టుడుగుతున్న వేళ‌... పార్ల‌మెంట్ వ‌ర్షాకాల‌ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై నీలినీడ‌లు అలుముకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ర‌క‌ర‌కాల త‌ర్జ‌న భ‌ర్జ‌న ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కే కేంద్రం మొగ్గు చూపింది. తొలుత ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించాల‌ని కూడా భావించారు. అయితే ఆన్ లైన్ లో సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని అధికారులు స్ప‌ష్టం చేయ‌డంతో ఎప్ప‌టిలా.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సిద్ధ‌మ‌వుతున్నారు.

పార్ల‌మెంట్ స‌భ్యుల మ‌ధ్య భౌతిక దూరం పాటింప‌జేస్తూ నిర్వ‌హించ‌నున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు వ్యక్తిగతంగా హాజరు కావల్సి ఉంటుదంటున్నాయి లోక్‌సభ, రాజ్యసభలు వర్గాలు. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం క‌నిపిస్తోంది. పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాల నిర్వహణకు కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్స్‌ కు ఓం బిర్లా,వెంకయ్యనాయుడు సూచించినట్టు స‌మాచారం. కరోనా నేపద్యంలో ఎంపీలు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది కాబట్టి లోక్‌సభ, రాజ్యసభతోపాటు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని ఇతర భవనాల్లో కూడా ఎంపీలకు సీటింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.