No Guarantee Trump Will Back India Against China US President s Ex Aide

పొరుగు దేశాల పట్ల చైనా కయ్యానికి కాలుదువ్వే స్వభావంతో వ్యవహరిస్తోందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‍ఎస్‍ఏ) జాన్‍బోల్టన్‍ అన్నారు. రాజకీయంగా, సైనిక పరంగానేగాక ఆర్థికంగానూ పొరుగు  దేశాలు తమపై ఆధారపడాలన్న వ్యూహంతోనే బెల్డ్ అండ్‍ రోడ్‍ ఇన్షియేటివ్‍కు చైనా శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ నాలుగు నెలలపాటు ట్రంప్‍కు కష్టకాలమేనని, ఆ తర్వాత ఆయన వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని బోల్టన్‍ అన్నారు. దశాబ్దాలుగా చైనా, భారత్‍ మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య పట్ల ట్రంప్‍కు ఏ మేరకు అవగాహన ఉందో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. మరోసారి ఈ రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరిగితే ట్రంప్‍ భారత్‍ పక్షం వహిస్తారని కచ్చితంగా చెప్పలేమని బోల్టన్‍ అన్నారు. చైనాతో వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తే ట్రంప్‍ వైకరి ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమని బోల్టన్‍ అన్నారు. జపాన్‍, అమెరికా, భారత్‍ మధ్య త్రైపాక్షిక సహకారం పట్ల ప్రధాని మోదీతో ఎంతో ఆసక్తి ఉన్నదని బోల్టన్‍ అన్నారు. ఇటీవల చైనాతో తలెత్తిన సరిహద్దు ఉద్రికత్తల సందర్భంగా భారత్‍కు అమెరికా నైతిక మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.