TDP Nakka Anand Babu Fires On Jagan Govt

నిర్మాణంలో ఉన్న స్మృతితివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని మాజీ మంత్రి నక్కా ఆనంద్‍ బాబు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు కూత వేటు దూరంలో ఉండి ఆన్‍లైన్‍లో శంకుస్థాపన చేయడం అంబేద్కర్‍ను కించపర్చినట్లే అని అన్నారు. అంబేద్కర్‍ 125వ జయంతి ఉత్సవాలు అనుగుణంగా గత ప్రభుత్వం 125 అడుగులు అంబేద్కర్‍ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయిలో అంబేద్కర్‍ ఖ్యాతిని బలపర్చడానికి 125 అడుగుల విగ్రహానికి పునాది వేశారు. సీఎం జగన్‍కి డాక్టర్‍ బీఆర్‍ అంబేద్కర్‍ అంటే గౌరవం లేదని ఎవరితో చర్చించకుండా రాత్రికి రాత్రి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. అంబేద్కర్‍ స్మృతివనం ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడే నిర్మించాలని డిమాండ్‍ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామేని, రాష్ట్ర స్థాయి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.