naga babu no responds to rgv s power star movie

రాంగోపాల్ వర్మ ఎంతో ధైర్యంగా పవర్ స్టార్ అనే టైటిల్ పెట్టి ఆ సినిమా వర్కింగ్ స్టిల్స్ తో  ఫుల్ ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటున్నాడు కానీ ఈ విషయం లో  తమ్ముడన్నయ్య నాగబాబు ట్విట్టర్ లో గాని మరే సోషల్ మీడియా లో స్పందించడం లేదు. అయన గతంలో  పలు సందర్భాల్లో "అన్నయ్యని కానీ, తమ్ముడ్ని కానీ పల్లెత్తు మాట అన్నా నేను తట్టుకోలేను.. వెంటనే బదులు చెప్తా". అన్న మెగా బ్రదర్ అలాంటి నాగబాబు ఆర్ జి వి  'పవర్ స్టార్' సినిమా పోస్టర్స్ మిగతా పరిణామాలపై ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏమీ పట్టనట్టు ఏబీవీపీ వార్షికోత్సవం, దలైలామాతో మధుర క్షణాలు అంటూ ట్వీట్లు వేసుకుని గప్ చుప్ అయ్యారెందుకు? సగటు మెగాభిమానులంతా ఇదే విషయంపై దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పోనీ పవన్ ఒక్కరినే వర్మ టార్గెట్ చేశారా అంటే అదీ లేదు..చిరంజీవిని కూడా ఇరికించేసి మరీ రెచ్చగొట్టారు.

అయినా సరే నాగబాబు సంయమనం పాటిస్తూనే ఉన్నారు. వర్మ ట్వీట్లపై ఆయన రియాక్షన్ బాగా లేటయిందనే అంటున్నారు ఆయన స్వభావం తెలిసినవారు. అయితే అదంతా పవన్ పై మెగాబ్రదర్ కు ఉన్న చిరు కోపమేనని తెలుస్తోంది. గతంలో గాడ్సేపై నాగబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో జనసేనకు ఏ సంబంధం లేదని పవన్ కల్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. అక్కడే అన్నాదమ్ములిద్దరికీ వ్యవహారం కాస్త బెడిసికొట్టింది. ఆ తర్వాత జనసేన కార్యకలాపాలకి నాగబాబు పూర్తిగా దూరం జరిగారు. కనీసం ఓ ట్వీట్ కూడా వేయడం లేదు. ఇక పవన్ కల్యాణ్ ని నేరుగా కలసిన సందర్భమూ లేదు. దాదాపు జనసేనకి నాగబాబు దూరమయ్యారనే అనుకున్నారంతా. అదే సమయంలో కరోనా క్రైసిస్ టైమ్ లో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాత్రం నాగబాబు చాలా తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పటి సీన్ లోకి వస్తే.. పవర్ స్టార్ సినిమా పోస్టర్, తర్వాత వరుసగా విడుదలైన స్టిల్స్ తో మెగాభిమానుల్ని మరింతగా రెచ్చగొడుతున్నాడు.    

ఒక్కరోజులోనే ఏపీ సోషల్ మీడియాలో కరోనాపై పోస్ట్ లు తగ్గిపోయి పవర్ స్టార్ సినిమాపై రియాక్షన్స్ అధిక సంఖ్యలో వున్నాయంటే వర్మ ట్వీట్స్ ఎంతటి  ఆకర్షణ పొందుతున్నాయో అర్థమవుతుంది. అయితే ఇక్కడ నాగబాబు మౌనమే సందేహాస్పదంగా మారింది. తమ్ముడిపై ఈగ వాలినా ఒప్పుకోని మెగా బ్రదర్, ఇప్పుడు పవర్ స్టార్  సినిమా తీసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని వాడుకోవటం చూస్తూ మిన్నకుండిపోయారు.  ఓ ట్వీట్ వేస్తే అలా పడుండేది కదా, అయినా ఆయన బైటకి రాలేదు. మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబు ఘాటు రియాక్షన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ వేడిలోనే నాగబాబు స్పందిస్తే బాగుంటుందని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.