Minister Talasani Srinivas Yadav Inspects Bonalu Arrangements

ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్‍ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు, అర్చకుల సమక్షంలో ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తాం. ఆలయ చరిత్రలో మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ బోనాలు జరుపుకోవాలి. అనవసరంగా బయటకు వచ్చి భక్తులు ఇబ్బందులు పడొద్దు అని తెలిపారు.