india-gets-final-batch-of-apache-attack-helicopters-amid-ongoing-standoff-with-china

చైనా సరిహద్దుల్లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత వాయుసేనలోకి ఐదు అపాచీ హెలికాప్టర్లు చేరాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన హెలికాప్టర్లుగా వీటికి పేరుంది. 2015లో భారత ప్రభుత్వం 22 అపాచీలు, 15 చినూక్‍ల కోసం అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‍తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే చినూక్‍లను, 17అపాచీలను బోయింగ్‍ సరఫరా చేసింది. ఇప్పుడు మిగిలిన ఐదు అపాచీలను కూడా భారత వాయుసేవకు అప్పగించింది. యుద్ధరంగంలో అమెరికా సైన్యం అపాచీలనే ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఇవి అధునాతనమైనవి. అన్ని వాతావరణాల్లోనూ పని చేస్తాయి. చినూక్‍ విషయానికొస్తే రవాణాకు ఈ హెలికాప్టర్లు ఉపయోగపడతాయి. భారీ యుద్ధ పరికరాలను మోసుకేళ్లే సామర్థ్యం వీటికుంది. ప్రపంచంలో కేవలం 20 దేశాల దగ్గర మాత్రమే చినూక్‍లు ఉన్నాయి.