TS Govt To Distribute Isolation Kit For Covid Patients

ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ఐసోలేషన్‍ కిట్‍ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‍ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశించారు.