donald-trump-says-he-expects-to-wear-a-mask-when-he-visits-military-hospital

అమెరికా మొత్తం కరోనాతో తల్లడిల్లుతున్నా ముఖానికి మాస్కు ధరించేందుకు ఒప్పుకోని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ట్ ఎట్టకేలకు మనసు మార్చుకున్నారు. ట్రంప్‍ మేరీలాండ్‍లోని వాల్టర్‍ రీడ్‍ మిలిటరీ దవాఖానను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో మాస్కు ధరిస్తానని ట్రంప్‍ తెలిపారు. విధినిర్వహణలో తీవ్రంగా గాయపడిన మన గొప్ప సైనికులను కలిసేందుకు వాల్టర్‍ రీడ్‍కు వెళ్తున్నాను. అక్కడికి వెళ్లినప్పుడు మాస్కు ధరించే అవకాశం ఉంది. అది తప్పనిసరి అని నేను భావిస్తున్నాను అని ట్రంప్‍ పేర్కొన్నారు.