US Supreme Court rules half of Oklahoma is Native American land

అమెరికా అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పును వెలువరించింది. ఓక్లహోమాలో సగానికిపైగా భూభాగం అమెరికా ఆదిమవాసులకు చెందినదేనని సృష్టం చేసింది. ఈ మేరకు 5-4తో మెజార్టీ తీర్పు ప్రకటించింది. దీంతో గతంలో నమోదైన, భవిష్యత్తులో నమోదయ్యే సివిల్‍, క్రిమినల్‍ కేసుల విచారణలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నేటివ్‍ అమెరికన్లతో ముడిపడిన కేసులను విచారించేందుకు ఇకపై రాష్ట్ర అధికారులకు అధికారం ఉండదు. ఫెడరల్‍ ప్రభుత్వం మాత్రమే వీటిని  విచారించేందుకు వీలుంటుంది. సుప్రీంకోర్టు తీర్పును క్రీక్‍ తెగ ప్రజలు స్వాగతించారు. క్రీక్‍ జాతికి అమెరికా ఇచ్చిన వాగ్దానాన్ని సుప్రీంకోర్టు నిలబెట్టిందని ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.             

తమ సార్వభౌమాధికారం, భౌగోళిక సరిహద్దులను గుర్తించడం ద్వారా తమ పూర్వీకులను దేశం గౌరవించేందుకు కోర్టు తీర్పు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పులో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తాజా తీర్పు వల్ల తీవ్రమైన నేరాలను విచారించే అధికారం రాష్ట్రానికి పోతుందని, ఓక్లహోమాలోని చాలా ప్రాంతాల్లో అస్థిర పాలనకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.