Rajnath Singh holds talks with US counterpart Esper discusses defence cooperation

చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదంపై రక్షణ మంత్రి రాజ్‍నాథ్‍ సింగ్‍ అమెరికా రక్షణ మంత్రి మార్క్ టి ఈస్పర్‍తో టెలిఫోన్‍ ద్వారా చర్చలు జరిపారు. అమెరికా విజ్ఞప్తి మేరకు ఈ చర్చలు జరగడం గమనార్హం. తూర్పు లద్దాఖ్‍లో తలెత్తిన ఘర్షణతో పాటు, మొత్తం భద్రతా వ్యవస్థపై ఇరువురు నేతలు సంభాషించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రక్షణ, భద్రత రంగాల్లో మరింతగా సహకరించుకోవడంపైనా వారు మాట్లాడుకున్నారు. సరిహద్దులో చైనా దురాక్రమణను, ఈ విషయమై భారత్‍ వైఖరిని రాజ్‍నాథ్‍ వివరించారు.