
కరోనా దెబ్బకు ప్రపంచమంతా పొదుపు బాట పట్టింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే చార్జర్, హెడ్ ఫోన్స్ ఉచితంగానే అందించేవారు. అయితే రాను రాను హెడ్‌ఫోన్స్‌ను ఇవ్వడం మానేశారు. తాజాగా మొబైల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొబైల్‌తో పాటు ఇచ్చే చార్జర్లకు కత్తెర వేయనున్నట్టు సమాచారం. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా మొబైల్ తయారీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సామ్సంగ్ కంపెనీ వచ్చే ఏడాది నుంచి చార్జర్ లేకుండా మొబైల్ అమ్మకాలను చేపట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది.