PV Narsimha Rao statue to ready in Tenali

తెలుగు వారికే గర్వకారణమైన బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ శిల్పశాలలో తయారుకానుంది. తెలంగాణలోని నాగర్‍కర్నూల్‍ జిల్లాలో ఏర్పాటుచేసేందుకు అక్కడి అభిమానులు కోరిక మేరకు దీనిని రూపొందిస్తున్నట్లు శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తెలిపారు. ఎనిమిది అడుగుల ఎత్తు, 400 కిలోల కంచుతో తయారయ్యే ఈ విగ్రహానికి సంబంధించిన మట్టి నమూనా పూర్తయిందని, విగ్రహ కమిటీ ప్రతినిధులు దీన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారని వారు చెప్పారు.