US bans Pakistan International Airlines flights over safety issues

అమెరికా పాకిస్థాన్‍ ఇంటర్నేషనల్‍ ఎయిర్‍లైన్స్ (పీఐఏ)కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. పాక్‍ పైలట్లలో ఎక్కువ మంంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పోందినవారే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యుఎస్‍ రవాణా శాఖ వెల్లడించింది. పాకిస్థాన్‍ ఫైలట్ల విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లపై ఫెడరల్‍ ఏవియేషన్‍ అడ్మినిస్ట్రేషన్‍ (ఎఫ్‍ఏఏ) ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‍ ఫైలట్లలో మూడో వంతు మందివీ నకిలీ సర్టిపికెట్లని గత నెలలో తేలింది. పీఐఏపై యూఎస్‍ నిషేధాన్ని పాక్‍ జయో న్యూస్‍ దృవీకరించింది. యూరోపియన్‍ యూనియన్‍ పీఐఏపై ఇప్పటికే నిషేధం విధించింది. ఆరు నెలలపాటు ఈయూకు అంతర్జాతీయ విమానాలు నడపడానికీ వీళ్లేదని పేర్కొంది. పాకిస్థాన్‍లోని కరాచీలో విమానాశ్రయంలో ల్యాండింగ్‍ సమయంలో పీఐఏ జెట్‍ విమానం కూలడంతో మే 22న 97 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ విమానం నడిపిన పైలట్లని కూడా నకిలీ సర్టిఫికెట్లేనని తేలింది.