KCR Administration at Erravelli Farmhouse

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావు ఇక మీదట ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రం నుంచే పాలన కొనసాగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సీఎం అయిన తర్వాత సచివాలయం నుంచి పాలన కొనసాగించిన సీఎం కేసీఆర్‍ అనంతరం వాస్తు బాగోలేదని, కొత్తగా నిర్మించిన సీఎం అధికారి నివాసం ప్రగతిభవన్‍ నుంచి తనదైన శైలిలో పాలన కొసాగించారు. కేబినెట్‍ సమావేశాలు సైతం అక్కడి నుంచే నిర్వహించి తన పాలన మార్కును తెలిపారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‍ మహానగరంలో కరోనా వైరస్‍ రోజురోజుకు పెరుగుతుండడం, మరో పక్క తన అధికార నివాసం, కార్యాలయాల్లో పనిచేసే వారిలో దాదాపు 20 మందికి కరోనా పాజిటివ్‍ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం అన్నింటికి సేఫ్‍జోన్‍గా భావించిన సీఎం ఇకపై అక్కడి నుంచే పాలన కొనసాగించాలని నిర్ణయించారు. తెలంగాణలో పాలనాపరమైన నిర్ణయాలన్నీ ప్రగతిభవన్‍ నుంచే తీసుకునేవారు సీఎం కేసీఆర్‍. అయితే ఇప్పుడు కాస్త రూటు మార్చి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్‍ హౌస్‍ నుంచి వ్యవహారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.