Why kids are often spared from severe COVID 19 reveals study

పెద్దలతో పోల్చితే పిల్లల్లో కరోనా ఎందుకు ప్రభావం చూపలేకపోతున్నదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‍ టెక్సాస్‍ హెల్త్ సైన్స్ సెంటర్‍ చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కణాల్లోకి కొవిడ్‍ 19 వైరస్‍ను పంపేలా ప్రేరేపించే యాంజియోటెన్సిన్‍-కన్వర్టింగ్‍ ఎంజైమ్‍2 (ఏస్‍2) పిల్లల్లో తక్కువగా ఉంటుందని తేలింది. పెద్దలతో పోల్చితే పిల్లల ఊపిరితిత్తుల్లో ఈ ఎంజైమ్‍స్థాయి తక్కువగా ఉండటంతో వైరస్‍ ప్రభావం కూడా తక్కువగా ఉంటున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.