Kiliveti Sanjeevaiah positive Report in Coronavirus

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు కరోనా సోకింది. ఆయనకు పాజిటివ్‍ నిర్ధారణ అయినట్లు బుధవారం సాయంత్రం గుర్తించిన అధికారులు హటాహుటిన ఆయన్ను నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‍ లోని కొవిడ్‍ విభాగానికి తరలించారు. ఆయనకు వివిధ పరీక్షలను నిర్వహించారు. రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్‍ వచ్చినప్పటికీ ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. లక్షణాలు లేని నేపథ్యంలో ఆయన్ను ఐసోలేషన్‍లో ఉంచుతారా, లేక హోం క్వారంటైన్‍ ను సిఫార్సు చేస్తారా అనేది ఇంకా తెలియలేదు.