Clinical trials to be initiated for Ayurvedic formulations against Covid 19 in India US

కొవిడ్‍ 19 వ్యాక్సిన్‍ అభివృద్ధికి ఒకవైపు అల్లోపతి వైద్యులు, శాస్త్రజ్ఞులు కృషి చేస్తుండగా, ఇప్పుడు అమెరికా, భారతదేశాల్లోని ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులూ రంగంలోకి దిగారు. ఆ వైరస్‍కు చెక్‍ పెట్టే ఆయుర్వేద ఔషధాలతో సంయుక్తంగా క్లినికల్‍ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని అమెరికాలోని భారత రాయబారి తరుణ్‍జిత్‍ సింగ్‍ సంధు తెలిపారు. భారత సంతతికి చెందిన అమెరికన్‍ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులతో జరిగిన వర్చువల్‍ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే సంయుక్త పరిశోధనలు, భోధన, శిక్షణ కార్యక్రమాల ద్వారా ఆయుర్వేదానికి ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.