bigg boss  season 4 to host nagarjuna

ఈమ‌ధ్య‌కాలంలో ప్రేక్ష‌కులు ఎక్కువ రోజుల నుంచి ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో మూడు సీజ‌న్లు కంప్లీట్ చేసుకొని నాలుగో సీజ‌న్‌కి సిద్ధ‌మైన ఈ షో గురించి రోజుకో అప్‌డేట్ వ‌స్తోంది. బిగ్‌బాస్ 4 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈసారి ఎవ‌రు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు? ఈసారి బ‌రిలోకి ఎవ‌రెవ‌ర్ని దింప‌బోతున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఈమ‌ధ్య బాగా వ‌స్తున్నాయి. సీజ‌న్ 4కి వ్యాఖ్యాత‌గా అల్ల‌రి న‌రేష్‌, నాగార్జున‌, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

ఇలా ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. అయితే ఫైన‌ల్‌గా నాగార్జున ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సీజ‌న్ 1కి ఎన్టీఆర్‌, సీజ‌న్ 2కి నాని, సీజ‌న్ 3కి నాగార్జున వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు నాలుగో సీజ‌న్‌కి కూడా నాగార్జునే రాబోతున్నాడ‌ట‌. అయితే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఈ షో కోసం నాగార్జున ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు? ఇది తెలుసుకునే ముందు అస‌లు ప్ర‌స్తుతం దేశం ప‌రిస్థితి ఎలా ఉంది.. సామాన్యుల నుంచి కోటీశ్వ‌రుల వ‌ర‌కు ఎవ‌రి రేంజ్‌కి త‌గ్గ‌ట్టు వారు క‌ష్ట‌కాలంలో ఉన్న‌ట్టే లెక్క‌. సామాన్యులు బ్ర‌త‌క‌డానికే టెన్ష‌న్ ప‌డుతుంటే.. కోటీశ్వ‌రులు త‌మ వ్యాపార వ్య‌వ‌హ‌రాల‌లో టెన్ష‌న్స్ బారిన ప‌డుతున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారింది. అన్ని రంగాలూ న‌ష్టాల‌తోనే న‌డుస్తున్నాయి.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే.. సినిమా రంగం, టీవీ రంగం చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొంటోంద‌ని, అందువ‌ల్ల నిర్మాణ వ్య‌యం త‌గ్గించుకుంటేనే గానీ సినిమా రంగం, టీవీ రంగం తేరుకోలేవ‌ని తే్ల్చేశారు. అందువ‌ల్ల ఆర్టిస్టులైనా, టెక్నీషియ‌న్లు అయినా త‌మ రెమ్యున‌రేష‌న్‌లో కొంత‌భాగం త‌గ్గించుకుంటే మ‌ళ్లీ మునుప‌టి రోజులు వ‌స్తాయ‌ని అందరూ భావిస్తున్నారు. అందులో భాగంగానే నాగార్జున బిగ్‌బాస్ సీజ‌న్ 4 కోసం త‌న రెమ్యున‌రేష‌న్‌ని త‌గ్గించుకొని మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అస‌లు విష‌యం ఏమిటంటే సీజ‌న్ 4 కోసం నాగార్జున రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్నాడ‌నే వార్త‌లో ఎలాంటి నిజం లేద‌ని తెలిసింది. సీజ‌న్ 3కి ఎంతైతే తీసుకున్నాడో సీజ‌న్ 4కి కూడా అంతే తీసుకోబోతున్నాడ‌ట‌. అయితే ఆ మొత్తం ఎంత అనేది తెలియ‌రాలేదు.