BJP State Vice President Vishnuvardhan Reddy Fire on YSRCP

వైసీపీ నాయ‌కులు భాజాపా పార్టీపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఘాటూగా స్పందించారు. రాష్ట్ర బీజేపీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఇటీవ‌ల‌ ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్య‌లు స‌రైన‌వి కావ‌న్నారు.  వైసీపీ నేత‌లు  బిజెపి నేతల మీద గాని, పార్టీ మీదకాని , చేసేముందు త‌మ‌దొక‌ ప్రాంతీయపార్టీ అనే విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. జాతీయ పార్టీగా బిజెపి  ఇంతకంటే ఎగిరెగిరి పడిన ప్రాంతీయ పార్టీలను దేశంలో చాలానే చూసిందన్న విషయాన్ని వైసిపి గుర్తు పెట్టుకోంటే మంచిదని హిత‌వు ప‌లికారు. స‌ద‌రు ప్రాంతీయ  పార్టీలన్నీ నేడు ఢిల్లీలో ఉన్న మోడీ  నుంచి ఫోన్ కోసం, ఆయ‌న అపాయింట్మెంట్ కోసం, బిజెపి నేతల పలకరింపు కోసం, కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

రాష్ట్రంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్లించడానికి  ఆడుతున్న రాజకీయ డ్రామాల‌ను ప్రజలు గుర్తిస్తున్నారని, వై యస్ ఆర్ పార్టీలో నాయకత్వం పై క్ర‌మ క్ర‌మంగా పెరుగుతున్న‌ తిరుగుబాటు ధోరణి నుంచి, ప్రజల ఆలోచనను  దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఆడుతున్న‌ నాటకమని స్పష్టంగా  అర్థమవుతోందన్నారు. వైసీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు  త‌మ‌ది రాజకీయ వాపా లేదా బలుపా అనే విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారన్నారు. ఆంధ్రాలో బిజెపిని ప్రతిపక్ష పార్టీగా  గుర్తించినట్లు వైసీపీ నేత‌ల‌ భయం  విమర్శలను బట్టి స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక, ఇళ్ల పట్టాలు, భూములు కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు వంటి అంశాల‌పై త‌మ పార్టీ చేస్తున్న ఆందోళనలు ప్రజలు గుర్తించారన్నారు. ప్రజల దృష్టిని మళ్ళించే  ఎత్తుగడలు మాని ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి మంచి
పాలన ఇవ్వాల‌ని సూచించారు. వైసీపీ ఎన్ని ఎత్తులేసినా వై యస్ ఆర్  పార్టీ వైఫల్యాలను, బీజేపీ ప్రజల ముందుకు  తీసుకేళ్ళి పోరాడుతూనే ఉంటుందని స్ప‌ష్టం చేశారు. వైసీపీ శ్రేణులు  చేస్తున్న విమర్శలు, త‌మ‌ పార్టీ నేతల నైతిక స్థైర్యాన్ని మరింతగా పెంచుతున్నాయ‌న్నారు.