Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. ఈ రోజు రాష్ట్రంలో కరోనాతో 13 మంది చనిపోయారు. వీరితో కలిపి ఇప్పటివరకు 277 మంది కరోనాతో మృతి చెందారు. ఈ రోజు నమోదైన కేసులలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 53 మంది కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు. రాష్ట్రానికి చెందినవారు 1500 మంది. కరోనా నుంచి కోలుకొని ఈ రోజు మరో 904 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.