Pentagon drafting ban on displaying Confederate flag at bases

అమెరికాలో ఇటీవల కాలంలో జాతి వివక్ష వ్యతిరేక నిరసనలు ఉదృతమవుతున్న తరుణంలో, ఆ దేశ రక్షణ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో కాన్ఫడరేట్‍ జెండాను ప్రదర్శించడాన్ని నిషేధించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి రూపొందించన ఓ ముసాయిదా ప్రతి వెలుగులోకి వచ్చింది. బానిసత్వానికి, వివక్షకు వ్యతిరేకంగా 1861 నుంచి 1865 వరకు జరిగిన అమెరికా పౌర యుద్దంలో ఉద్యమకారులు కాన్ఫడరేట్‍ జెండాను ఉపయోగించారు. ఎరుపు రంగు వస్త్రంపై, నీలం రంగు పట్టీల్లో తెల్లటి నక్షత్రాలు కనిపించేలా ఇది ఉంటుంది. ఆ యుద్ధం ముగిశాక కూడా ఇప్పటికే కొన్ని సంస్థలు, వ్యక్తులు ఆ జెండాను అక్కడ ప్రదర్శిస్తుంటారు. వాస్తవానికి కాన్ఫడరేట్‍ జెండాపై చాలా కాలంగా వివాదం ఉంది. దాన్ని ఇప్పటికే అమెరికాలో ఉన్న బానిసత్వానికి గుర్తుగా భావిస్తూ ఆఫ్రో అమెరికన్లు వ్యతిరేకిస్తుండగా, శ్వేత జాతీయులు మాత్రం, దానికి మద్దతుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆ జెండా ప్రదర్శనను నిషేధించేందుకు రక్షణ శాఖ అడుగులు వేస్తున్నట్లు ముసాయిదా ద్వారా తెలుస్తోంది. రక్షణ శాఖ ఉద్యోగుల్లో చాలా మంది మైనార్టీలు ఉన్నారు. కాన్ఫడరేట్‍ జెండా ప్రదర్శన వల్ల వారి మనోభావాలు దెబ్బతినే అవకాశముంది. ఆ నిషేధం వల్ల రక్షణ శాఖ ఉద్యోగుల్లో విశ్వాసం, క్రమశిక్షణ ఏర్పర్చడానికి వీలవుతుంది అని ముసాయిదాలో పేర్కొన్నారు.