Donald Trump considering ban on TikTok to punish China

టిక్‍టాక్‍ను అమెరికాలో నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ పేర్కొన్నారు. కరోనా అంశంలో ప్రపంచాన్ని మోసం చేసిన చైనాకు బుద్ధి చెప్పడంలో ఇదో భాగమని తెలిపారు. తమ పౌరుల సమాచారాన్ని టిక్‍టాక్‍ చైనాకు చేరవేస్తున్నదని ఆరోపించారు. కరోనా కారణంగా మూతబడ్డ స్కూళ్లకు తిరిగి తెరిపించేందుకు గవర్నర్లపై ఒత్తిడి తీసుకొస్తామని ట్రంప్‍ పేర్కొన్నారు.