us-announces-new-visa-restrictions-on-china-over-access-to-tibet

టిబెట్‍ సందర్శనకు విదేశీయుల అనుమతిని నిలిపివేసిన చైనా తీరుపై అమెరికా మండిపడింది. సందర్శనకు ఎందుకు అనుమతించరంటూ ప్రశ్నించింది. దీన్ని నిరసిస్తూ ఆ దేశ అధికారుల వీసాలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. టిబెట్‍కు విదేశీయుల రాకను అడ్డుకోవడంలో భాగమవుతున్న అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‍ పాంపియో ప్రకటించారు. టిబెట్‍ వాసుల స్థిరమైన ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు అమెరికా కృషి చేస్తుందని పాంపియో సృష్టం చేశారు.