Coronavirus Positive Cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏరోజుకారోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. జూన్‍ నెల మొత్తం 13,641 కేసులు నమోదు అయితే, జూలైలో కేవలం 8రోజుల వ్యవధిలోనే ఏకంగా 13,197 పాజిటివ్‍ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 1924 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు అత్యధికంగా పాజిటివ్‍ కేసులు రావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో  రాష్ట్రంలో వైరస్‍ బారినపడినవారి సంఖ్య 29,546కు చేరుకుంది. గ్రేటర్‍ హైదరాబాద్‍ పరిధిలో అత్యధికంగా 1590 మందికి పాజిటివ్‍ నిర్ధారణ అయింది.