TN Electricity Minister Thangamani Tests Positive For Coronavirus

తమిళనాడులో కరోనా వైరస్‍ బారిన ప్రముఖులు కూడా పడుతున్నారు. అన్నాడీఎంకే సీనియర్‍ లీడర్‍, విద్యుత్‍ శాఖ మంత్రి పీ తంగమణికి కరోనా పాజిటివ్‍ నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బలగన్‍ కు కరోనా సోకింది. ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కే పళని(శ్రీపెరంబుదూర్‍), అమ్మన్‍ కే అర్జున్‍(కొయంబత్తూర్‍ సౌత్‍), ఎన్‍ సత్తాన్‍ ప్రభాకర్‍(పరమకుడి), కుమారగురు(ఉలుందుర్‍ పేట)కు కరోనా పాజిటివ్‍ నిర్ధారణ అయింది. అన్నాడీఎంకే సీనియర్‍ నాయకులు, మాజీ మంత్రి బీ వలర్మతి కరోనాతో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు.