Telangana new Secretariat building design released

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నూతన రాష్ట్ర సచివాలయం నమూనా ఖారారైంది. తాజాగా సచివాలయం నమూనా చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఎప్పటి నుంచో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని నిర్ణయించింది. కానీ న్యాయపరమైన అడ్డంకులు వచ్చిపడ్డాయి. ఇటీవల హైకోర్టు సచివాలయ భవనాల కూల్చివేతకు, కొత్త సచివాలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే సచివాలయం భవనాల కూల్చివేత పనులను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ వెంటనే కొత్త సచివాలయ నమూనా విడుదల చేసింది.