Mike Pompeo says US looking at banning Chinese social media apps, including TikTok

చైనాకు చెందిన 59 సోషల్‍ మీడియా యాప్‍లను భారత్‍ నిషేధించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో అమెరికా కూడా డ్రాగన్‍ దేశ యాప్‍లను బ్యాన్‍ చేయాలని భావిస్తున్నది. చైనా యాప్‍లను నిషేధించాలని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‍ పాంపియో తెలిపారు. టిక్‍టాక్‍తో సహా అన్ని రకాల యాప్‍లను బ్యాన్‍ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఓ అంతర్జాతీయ ఛానల్‍తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‍ కన్నాముందే బహిరంగపరచడం ఇష్టం లేదు, కానీ కచ్చితంగా చైనా యాప్‍లను నిషేధించే యోచనలో ఉన్నాం అని మైక్‍ పాంపియో సృష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అక్కడి కంపెనీలు, చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని ఇప్పటికే అమెరికా చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టిక్‍టాక్‍ వంటి యాప్‍లు సేకరించే సమాచారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.