cm-ys-jagan-reviews-on-housing-scheme

రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొన్ని రోజులు వాయిదా పడిందే తప్ప ఆగబోదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై మంగళవారం ఆయన మాట్లాడుతూ డి ఫారం పట్టాలైతే ఇప్పుడే ఇచ్చేసేవాళ్లమని అయితే రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్లను ఒక ఆస్తి రూపంలో ఇవ్వాలనుకుంటున్నామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల అంశంపై తేదేపా కోర్టుల ద్వారా అడ్డుపడడం దురదృష్టకరమన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని, ఆగస్టు 15న తప్పకుండా పంపిణీ చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 30శాతం మందికి తాము ఇళ్లు, ఇళ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు. దాదాపు 20వేల కోట్ల ఆస్తిని వారికి పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.