Rythu Bharosa Kendras will now be called as Dr YSR Rythu Bharosa Kendras

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి వైఎస్‍ఆర్‍ పేరు పెట్టింది. రైతు భరోసా కేంద్రాలకు వైఎస్‍ఆర్‍ పేరును జతచేర్చింది. ఇకపై డాక్టర్‍ వైఎస్‍ఆర్‍ రైతు భరోసా కేంద్రాలుగా పేరు మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‍ వైఎస్‍ రాజశేఖర్‍ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి చేసిన సేవలకు గుర్తుగా పేరు మారుస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. వైఎస్‍ఆర్‍ ఆశయాలకు అనుగుణంగా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక పథకాల అమలుతో పాటు సేవలు అందిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదయిన సందర్భంగా ఇటీవలనే రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు.