Buffett biggest loser among billionaires in 2020

అమెరికా వ్యాపారవేత్త, బెర్క్షైర్‍ హాథవే అధినేత వారెన్‍ బఫెట్‍కు కాలం కలసి రావడం లేదు. ఈ ఏడాది అమెరికా స్టాక్‍ మార్కెట్లు 40 శాతం మేర పెరిగినా బఫెట్‍ సంపద దాదాపు రూ.1.4 లక్షల కోట్లు తరిగిపోయింది. దీంతో ఈ ఏడాది అత్యధికంగా నష్టపోయిన ప్రపంచ కుబేరుల్లో ఆయనే అగ్రస్థానంలో నిలిచినట్టు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అయినా 70.4 బిలియన్‍ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ధనికుల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నట్టు తెలిపింది.