H1 B visa suspension to have Rs 1200 cr impact on Indian IT firms  Crisil

అమెరికా సర్కారు హెచ్‍ 1బీ, ఎల్‍ 1 వీసాలను తాత్కాలికంగా రద్దు చేయడంతో.. ఈ కారణంగా భారత ఐటీ కంపెనీలపై రూ.1,200 కోట్ల ప్రభావం ఉండొచ్చని రేటింగ్‍ ఏజెన్సీ క్రిసిల్‍ అంచనా వేసింది. భారత ఐటీ కంపెనీల లాభదాయకతపై 0.25-0.30 శాతం ప్రభావం చూపించొచ్చని పేర్కొంది. ట్రంప్‍ సర్కారు ఉద్యోగ వీసాలపై ఆంక్షల కారణంగా భారత ఐటీ కంపెనీలు గత కొన్నేళ్లలో స్థానిక నియామకాలను పెంచినందున... ప్రస్తుత నిషేధంతో భారత ఐటీ కంపెనీలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందని క్రిసిల్‍ విశ్లేషించింది.