trump-connected-lobbyists-are-getting-billions-in-federal-coronavirus-aid-report-finds

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍తో సంబంధం ఉన్న 40 మంది లాబీయిస్టులు తమ క్లయింట్లు 1,000 కోట్ల డాలర్లకు పైగా ఫెడరల్‍ కరోనా వైరస్‍ సంబంధిత లబ్ది పొందడానికి సహకరించినట్టుగా తెలుస్తోంది. లాబీయిస్టుల్లో ఐదుగురు మాజీ పాలనా అధికారులని సమాచారం. వీరు చేసిన పని ట్రంప్‍ నైతిన విధానాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లాబీయిస్టులను పబ్లిక్‍ సిటిజెన్‍ అనే సంస్థ గుర్తించింది. వీరు ట్రంప్‍ ఎగ్జిక్యూటివ్‍ శాఖ, ఆయన ప్రచారాలు, ప్రారంభ కమిటీ,  అధ్యక్షుడి మార్పు టీమ్‍లలో పని చేసినట్టు పేర్కొంది. వీరిలో చాలా మంది ట్రంప్‍ ప్రచారాలకు విరాళాలు అందించారు. కొంత మంది ట్రంప్‍  ఎన్నికకు నిధులను సమీకరిస్తున్న వారిలో ఉన్నారు.