North Korea says no more talks with US

కిమ్‍ జోంగ్‍ ఉన్‍- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మధ్య మరో సమావేశం అవసరం లేదని ఉత్తర కొరియా తెలిపింది. ఉత్తర కొరియా-అమెరికా మధ్య మరోసారి శిఖరాగ్ర సమావేశానికి ప్రతిపాదన వచ్చిన నేపధ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి చో సన్‍-హు ఈ ప్రకటన చేశారు. గత సమావేశాల్లో చేసిన ఒప్పందాలను పట్టించుకోకుండా తమతో శత్రుభావంతో సాగే అమెరికాతో చర్చలు జరపడం సాధ్యం కాదని చెప్పారు. నవంబర్‍లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే లోపు అమెరికా-ఉత్తర అమెరికా కొరియా మధ్య మరోసారి శిఖరాగ్ర చర్చలు జరగాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‍ జె ఇన్‍ మూడు రోజుల క్రితం ప్రతిపాదించారు. 2018, 2019ల్లో కిమ్‍ ట్రంప్‍ మూడు సార్లు సమావేశమయ్యారు. అయితే ఎలాంటి ఫలితాల్ని ఇవ్వలేదు.