US nuclear envoy to visit South Korea

అమెరికా న్యూక్లియర్‍ రాయబారి ఈ వారంలో దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ  పర్యటనలో అణ్వాయుధీకరణతో సహా వివిధ అంశాలపై చర్చించనున్నట్లు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి స్టీఫెన్‍ బైగన్‍ పర్యటించనున్నారు. బుధవారం కొరియా విదేశాంగ మంత్రి కంగ్‍ క్యంగ్‍ వాతో స్టీపెన్‍ భేటీ అవుతారు. తరువాత కొరియా సహాయ విదేశాంగ మంత్రితో తొమ్మిదో వూహ్యాత్మక ద్వైపాక్షిక చర్చలు పాల్గొంటారు. 2006లో అమెరికా, దక్షిణ కొరియా విదేశాంగ శాఖ సహాయ మంత్రుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి.  ఈ పర్యటనలో దక్షిణ కొరియా శాంతి, భద్రతా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధితోనూ స్టీఫెన్‍ సమావేశం అవుతారు.