Sumalatha Ambareesh tests positive for COVID19

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు.కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ సోమవారం రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు డాక్టర్లు. ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.