Shagufta Rafiques Journey from a Bar Dancer to a Script Writer

చిత్ర విచిత్రమైన ఈ చిత్ర సీమలో ప్రతి ఒక్కరికి ఒక్కో కథ ఉంటుంది. ఈ రోజు టాప్ పొజిషన్ లో వున్న ఎందరో ఎన్నో కష్టాలను అనుభవించి అవమానాలను సహించి ఈ స్థాయికి చేరుకొని వుంటారు. ఈ సమాజంలో గొప్పగా బ్రతకాలని గౌరవమైన జీవితాన్ని పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ "ఆకలి ఊదే నాగ స్వరానికి ఆడక తప్పదు మనిషి" అని శ్రీ శ్రీ గారు అన్నట్టు.. ఆకలి వేదనకు భరించలేక ఒక బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీ తన ఆడతనాన్ని అమ్ముకుని అలాంటి జీవితాన్ని దాటుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సెక్స్ వర్కర్ నుంచి ఒక రైటర్ గా మారిన ఆమె జీవితంలో ఎన్నో చెరగని చేదు అనుభవాలు ఉన్నాయి. కనీసం తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అంటే ఆమె ఎలాంటి పరిస్థితులను అధిగమించి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆ స్టార్ రైటర్ మరెవరో కాదు. బాలీవుడ్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం ఆషికి 2 వంటి ఎమోషనల్ లవ్ స్టోరిలకు రైటర్ గా వర్క్ చేసిన షాగుప్తా రఫీక్. మనవారికి ఆమె పెద్దగా పరిచయం లేకపోవచ్చు గాని బాలీవుడ్ జనాలకు మాత్రం బాగా తెలుసు. అయితే షాగుప్తా రైటర్ గా జీవితాన్ని స్టార్ చేయడానికి ముందు ఎవరు ఊహించని కఠినతరమైన జీవితాన్ని ఎదుర్కొంది.

ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న దారుణమైన సంఘటనలను చెప్పింది. బాలీవుడ్ లో అతి తక్కువ బడ్జెట్ లో వచ్చి 200కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఆషికీ 2 సినిమాకు కథ, మాటలు అందించిన షాగుప్తా చూస్తుండగానే బాలీవుడ్ స్టార్ రైటర్స్ లో ఒకరిగా మారిపోయింది. అయితే ఆమె జీవితం ఒక సెక్స్ వర్కర్ నుంచి ఉహీంచని మలుపులు తిరిగింది. కనీసం తన తల్లిదండ్రులు ఎవరో కూడా షాగుప్తాకి తెలియదట అంటే ఆమె ఎలాంటి పరిస్థితులను దాటుకుంటూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. షాగుప్తా యుక్త వయస్సుతో ఒంటరిగా వున్నపుడు ఒక మహిళ ఆమెను చేరదీసింది. కొన్నాళ్లకు ఆ మహిళ మరో వ్యక్తి తో సహజీవనం చేయటం జరిగింది అకస్మాతుగా అతను కొన్నిరోజులకే మరణించడంతో మళ్ళి వారి జీవితం మరింత అంధకారంలోకి వెళ్లింది.

దీంతో టీనేజ్ వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్న షాగుప్తా.. ఒక బార్ డ్యాన్సర్ గా (చాందిని బార్ లో టబు లాగ) కొనసాగింది. బార్ డ్యాన్సర్ గా చేస్తుండగానే డబ్బుల కోసం సెక్స్ వర్కర్ గా మారే పరిస్థితి ఏర్పడింది. ఆకలి కోసం ఆమె ఒళ్ళు అమ్ముకోక తప్పలేదు. డ్యాన్స్ చేస్తుంటే తనపై అసభ్యకరంగా డబ్బులు చల్లారని చెప్పిన షాగుప్తా ఒక మహిళను ఈ సమాజంలో ఎలా చూస్తారో అప్పుడే అర్ధమయ్యిందని డైరెక్ట్ గా చెప్పేసింది. కొన్నాళ్లకు జీవితంలో నాకు నచ్చిన పని చేయాలని అనుకున్నాను అంటూ రైటర్ గా మారినట్లు తెలిపింది. ఎలాగైనా రైటర్ కావాలని దృఢంగా నిశ్చయించుకున్నాను.

సీనియర్ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ ని కలిసి తన రైటింగ్ స్కిల్స్ ని చూపించగా వెంటనే ఆయన నాకు సపోర్ట్ చేశారని తెలిపింది. 2006లో వచ్చిన 'వా..లంహే' సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్ గా డైలాగ్స్ రైటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన షాగుప్తా ఆ తరువాత మర్డర్ 2, జన్నథ్ 2 వంటి సినిమాలతో తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. ఇప్పటి వరకు షుమారు 18 సినెమాలకు పనిచేసిన షాగుప్తా కష్టపడి ఎంచుకున్న మంచి దారి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.