Dhanushs gives the nod to Jagame Thanthirams OTT release

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డం, అందుబో భాగంగానే షూటింగులు నిలిపివేయ‌డం, థియేట‌ర్స్ మూసివేయ‌డం వంటివి సినిమా ప‌రిశ్ర‌మ‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తున్నాయి. ఈమ‌ధ్య షూటింగుల‌కు అనుమ‌తులిచ్చినా ఎవ‌రూ ధైర్యంగా షూటింగ్ చేయ‌లేని ప‌రిస్థితి ప్ర‌స్తుతం దేశంలో ఉంది. ఇక థియేట‌ర్స్ సంగ‌తి స‌రేస‌రి. దేశ‌వ్యాప్తంగా మూడు నెల‌ల‌కు పైబ‌డి థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. రిలీజ్‌కి రెడీ అయిన సినిమాల‌ను థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించుకునే అవ‌కాశం లేదు. సినిమా థియేట‌ర్ల‌నే నమ్ముకొని జీవ‌నం సాగించే వారి బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ఇక కోట్లు కుమ్మ‌రించి సినిమాలు తీసి రిలీజ్‌కి నోచుకోక‌పోవ‌డంతో నిర్మాత‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలోనే ఓటీటీ అనేది నిర్మాత‌ల పాలిట వ‌రంలా మారింది. ఇప్ప‌టికిప్పుడు థియేట‌ర్స్ ఓపెన్ చేసినా జ‌నం థియేట‌ర్స్‌కి వ‌చ్చి సినిమా చూసే ప‌రిస్థితి లేదు. అలాంట‌ప్పుడు ఓటీటీ ద్వారానే సినిమాలు రిలీజ్ చెయ్యాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా ప‌లు భాషా చిత్రాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక వెబ్ సిరీస్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాల‌ను త‌ల‌ద‌న్నే విధంగా వెబ్ సిరీస్‌ల‌ను నిర్మిస్తున్నారు. ఓటీటీలో సినిమా రిలీజ్ చెయ్యాలంటే వెబ్ సిరీస్‌ల ధాటికి త‌ట్టుకునేలా ఉండాలి. అయితే ఇది స్టార్ హీరోల సినిమాల‌కు వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు. ఆయా స్టార్‌ల‌కు ఉన్న ఇమేజ్ వ‌ల్ల సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. కాబ‌ట్టి అంద‌రూ చూసే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కు సౌత్‌లో ఓ రేంజ్ సినిమాలు మాత్ర‌మే ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఫ‌స్ట్ టైమ్ ఓ సౌత్ హీరో సినిమా ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అవుతోంది. ఆ హీరో ఎవ‌రో కాదు ధ‌నుష్‌. అత‌ని తాజా చిత్రం `జ‌గ‌మే తందిరం`. వైనాట్ స్టూడియోస్ ప‌తాకంపై కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చెయ్యాల‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ధ‌నుష్ స‌ర‌నన ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల‌య్యే తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.