https://www.tTamannah Bhatia to host Special Talk Show

సినిమాల్లో హీరోలకు ఉన్నంత స్పాన్ హీరోయిన్ల‌కు ఉండ‌దు. 30 సంవ‌త్స‌రాల‌కు పైగా హీరోలుగా న‌టిస్తూ ఇప్ప‌టికీ ఫామ్‌లో ఉన్నవారు ఉన్నారు. కానీ, హీరోయిన్ల విష‌యంలో ఇది పూర్తి రివ‌ర్స్‌గా ఉంటుంది. వారు హీరోయిన్‌గా కొన్ని సంవ‌త్స‌రాలు మాత్ర‌మే రాణించ‌గ‌లుగుతారు. 10 సంవ‌త్స‌రాల‌కు మించి ఏ హీరోయిన్ కూడా ఫామ్‌లో ఉండ‌రు. కానీ, ఈమ‌ధ్య‌కాలంలో కొంత‌మంది హీరోయిన్లు 15 సంవ‌త్స‌రాలు దాటిపోయినా ఇంకా సినిమాలు చేస్తూ తాము కూడా త‌క్కువేం కాదు అని నిరూపిస్తున్నారు. వారిలో త్రిష‌, న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా, శ్రీ‌యా శ‌ర‌ణ్ వంటి హీరోయిన్లు ఉన్నారు.

వీళ్ళంతా ఇండ‌స్ట్రీకి వ‌చ్చ 15 సంవ‌త్స‌రాలు దాటిపోయినా ఇప్ప‌టికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే అంత‌కుముందు ఉన్న స్పీడ్ ఇప్పుడు త‌గ్గుతుంది కాబ‌ట్టి అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తుంటారు. వీరిలో న‌య‌న‌తార మాత్రం కాస్త స్పీడ్‌గానే ఉంద‌ని చెప్పాలి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే త‌న‌కు సినిమాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని ముందుగానే గ్ర‌హించిన త‌మ‌న్నా ఇప్పుడు బుల్లితెర‌పై క‌నిపించాల‌ని ఆశ‌ప‌డుతోంది.

ఓటీటీలో ప్ర‌సార‌మ‌య్యే ఓ షో ద్వారా త‌మ‌న్నా బుల్లితెర‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంద‌ని ఆమ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. ప్రస్తుతం త‌మ‌న్నా మూడు సినిమాలు చేస్తోంది. అందులో ఓ హిందీ సినిమా కూడా ఉంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగులు ఆగిపోయాయి. ప్ర‌స్తుతం దేశం ఉన్న ప‌రిస్థితుల్లో ఎప్పుడు షూటింగ్ మొద‌ల‌వుతుందో తెలీని ప‌రిస్థితి. అందుకే ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాల‌ని ఆశ‌ప‌డుతోంద‌ట‌. అల్లు అర‌వింధ్ సార‌ధ్యంలో న‌డుస్తున్న ఓటీటీ `ఆహా`లో ఒక టాక్ షో నిర్వ‌హించాల‌ని యాజ‌మాన్యం భావిస్తోంది. సినిమా సెల‌బ్రిటీస్‌తో ఇంట‌ర్వ్యూ త‌ర‌హాలో సాగే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డానికి ఒక టాలీవుడ్ సెల‌బ్రిటీ అయితేనే బాగుంటుంద‌ని భావించిన అల్లు అర‌వింద్ దానికి త‌మ‌న్నా అయితే బాగుంటుంద‌ని స‌జెస్ట్ చేశాడ‌ట‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఏమీ రాన‌ప్ప‌టికీ త‌మ‌న్నా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని తెలుస్తోంది. అయితే ఈ షో కోసం త‌మ‌న్నాభారీగా రెమ్యున‌రేష‌న్ ఎక్స్‌పెక్ట్ చేస్తోందట‌.

ఒక ఎపిసోడ్‌కి 8 ల‌క్ష‌ల రూపాయ‌లు డిమాండ్ చేసింద‌ట‌. ఓటీటీలో చేసే షో కోసం ఇంత భారీ రెమ్యున‌రేష‌న్ ఇవ్వాలంటే క‌ష్ట‌మైన ప‌నే. మ‌రి దీనికి ఆహా యాజ‌మాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆ లెక్క‌న షో కంప్లీట్ అయ్యే నాటికి ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయోగానీ త‌మ‌న్నాకి మాత్రం ఒక సినిమా చేస్తే ఎంత రెమ్యున‌రేష‌న్ ముడుతుందో ఈ షో ద్వారా కూడా అంతే రెమ్యున‌రేష‌న్ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.