Ram Gopal Varma reacts to case against him for film Murder I have no intention to demean anyone

రామ్ గోపాల్ వర్మ కు వివాదాలు, బెదిరింపులు  కోర్టు కేసులు కొత్త కాదు ఓవైపు కేసులు నడుస్తున్నప్పటికీ తానూ అనుకున్నది చేసుకుంటూపోతాడు. ప్రజల్లోకి తన సినిమాలను తీసుకెళతాడు.  ఇప్పుడు మర్డర్ అనే సినిమాపై కూడా కేసు పడింది. కానీ ఆర్జీవి  వెనక్కి తగ్గలేదు. కోర్టు కేసు పడినప్పటికీ మర్డర్ సినిమా చేస్తానని బాహాటంగా స్పష్టంగా ప్రకటించాడు.వరుసగా వివాదాస్పద చిత్రాలనే తీస్తున్న రాంగోపాల్ వర్మ… ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫుల్‌గా ఫోకస్ చేసాడు  ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. దీంతో ఎంతో మంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ.. ఆర్జీవీ వెనకడుగు వేసిన దాఖలాలు లేవనే చెప్పాలి.

ఇంతకీ విషయం ఏంటంటే ప్రణయ్ హత్య కేసు, మారుతిరావు ఆత్మహత్య పాయింట్స్ ను బేస్ చేసుకొని మర్డర్ అనే సినిమా ప్రకటించాడు వర్మ. ఆ వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న మొయినాబాద్ లోని ఓ గెస్ట్ హౌజ్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా కోసం ప్రణయ్, అమృత, మారుతిరావు ఫొటోలు వాడారని, పేర్లను కూడా యథాతథంగా వాడుతున్నారంటూ ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించాడు. అయితే సినిమా షూటింగ్ ను నిలిపివేయాలన్న వాదనను తోసిపుచ్చిన కోర్టు.. దర్శక-నిర్మాతలపై కేసు నమోదుచేయాలని మిర్యాలగూడ పోలీసుల్ని ఆదేశించింది. దీనిపై వర్మ ఘాటుగా స్పందించాడు. ఎట్టిపరిస్థితుల్లో తను సినిమా తీస్తానంటున్నాడు. "నేను ఎవ్వర్నీ కించపరచడానికి ఈ సినిమా తీయడం లేదు. సమాజంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా సినిమా చేస్తున్నాను. నా హక్కుల పరిరక్షణ కోసం దీనిపై నేను కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను." అని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.  ఇంతకీ ఈ వార్త వైరల్ అవడానికి ట్విట్టర్ వేదికైంది ఫాదర్స్ డే సందర్భంగా ప్రణయ్, మారుతిరావు, అమృత పేర్లు వచ్చేలా ట్వీట్ చేశాడు వర్మ. "మారుతి వధించిన ప్రణయామృత విషాధ గాధ" అంటూ మర్డర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇలా తమ పేర్లు వాడడం పై అమృత కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు ఆ తరువాత కోర్టు లో కేసు పెట్టారు.