Coronavirus spreads through the air

రోజురోజుకూ కరోనా వ్యాప్తి ప్రపంచంలో పెరిగిపోతోంది. లాక్‍డౌన్‍ పెట్టినా, మాస్కులు తొడుకున్నా, చేతులు శుభ్రం చేసుకున్నా, భౌతికదూరం పాటించినా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అయితే కరోనా గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతోందని కొంతమంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలో ఒక సైన్స్ జర్నల్‍లో ప్రచురించబోతున్నారంటూ ఆ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. కరోనా లక్షణాలు కల్గిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తంపర్లు గాలిలో ఉండే సూక్ష్మ కణాల్లోకి వెళ్లి ఓ గది లాంటి నిర్ధేశిత ప్రదేశంలో తిరుగుతూ ఇతరులకు వ్యాపిస్తుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అంశాలను పేర్కొంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అమలు చేయాల్సిన నిబంధనావళితో ఈ మేరకు మార్పులు  చేయాలని వారు డబ్ల్యూహెచ్‍వోను కోరారు. అయితే డబ్ల్యూహెచ్‍వో మాత్రం గాలి ద్వారా వ్యాప్తి జరగడం అసాధ్యమని అంటోంది. కరోనా రోగుల తుంపల్ల ద్వారానే వైరస్‍ సోకుతుంది తప్ప, గాలిలో ఉండే కణాల ద్వారా సాధ్యం కాదని డబ్ల్యూహెచ్‍వో చెబుతోంది.