Cognizant Will Fire Employees Under Performance Management Will 18000 Employees Get Fired

భారత్‍లోని వేర్వేరు ప్రాంతాల్లో కొంతమంది ఉద్యోగులను ఐటీ సంస్థ కాగ్నిజెంట్‍ తొలగిస్తోంది. ఇప్పటివరకు ఎంత మందిని తొలగించిందనేదానిపై సృష్టత లేదు. అయితే వందలమందిని తొలగించిందని ఐటీ ఎంప్లాయిస్‍ యూనియన్లు ఈ మేరకు పేర్కొంటున్నాయి. ఆల్‍ ఇండియా ఫోరం ఫర్‍ ఐటీ ఎంప్లాయిస్‍ (ఏఐఎఫ్‍ఐటీఈ) జనరల్‍ సెక్రటరీ వినోద్‍ ఏజే మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‍, పుణే, కొచ్చి కలకత్తా నగరాల్లో పనిచేస్తున్నవారిలో కొంతమందిని కాగ్నిజెంట్‍ తొలగించిందని చెప్పారు. మరో 18,000 మంది ఉద్యోగులున్నారు. వీరిలో కూడా అత్యధిక మందిపై ఈ ప్రభావం పడొచ్చని తెలియజేస్తూ లేబర్‍ డిపార్ట్మెంట్‍, ఇతర ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని వినోద్‍ ఏజే పేర్కొన్నారు.