Pune man gets mask made of gold worth around 3 lakh

పుణె జిల్లాకు చెందిన ఓ ఔత్సాహికుడు బంగారంతో మాస్క్ చేయించి పెట్టుకున్నాడు. అతి పలుచగా చిన్న చిన్న రంధ్రాలతో ఉంది. గాలి పీల్చుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ లేదంటున్నాడు. మామూలు మాస్కు ఉన్నంత సౌకర్యంగా ఉండదని ఆయనే చెబుతున్నాడు. అతని పేరు శంకర్‍ కురాడే. దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టాడు. స్వతహాగా బంగారం ప్రియుడు. చేతులు, మెడ అంతా బంగారం మయమే. అందుకే మూతికీ, ముక్కుకీ మాస్కు రూపంలో బంగారం తొడుగు చేయించుకున్నాడు. సిల్వర్‍ మాస్కు వేసుకున్న ఓ వ్యక్తిని సోషల్‍ మీడియాలో చూడగానే తనకీ ఐడియా వచ్చిందంటున్నాడు.