US President Trump targets radical left China in Independence Day speech

సమాన అవకాశం, సమన్యాయం, సమానంగా చూడడంపై తమకు నమ్మకం ఉన్నప్పటికీ అమెరికా చరిత్రను తుడిచిపెట్టడానికి అమెరికా చారిత్రక యోధులకు అప్రతిష్ట తేడానికి ఈ నిర్దాక్షిణ్య ఆందోళన సాగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మౌంట్‍ రష్మోర్‍ నేషనల్‍ మెమోరియల్‍ వద్ద ప్రసంగించారు. జాతి వివక్షత, పోలీస్‍ క్రూరత్వానికి నిరసనగా గత కొన్నాళ్లుగా సాగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని నిందా పూర్వకంగా ప్రసంగించారు. జాతి వివక్షత, పోలీస్‍ క్రూరత్వానికి నిరసనగా గత కొన్నాళ్లుగా సాగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని నిందా పూర్వకంగా ప్రసంగించారు. మిన్నెపొలిస్‍ వద్ద నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‍ ను పోలీసులు హత్య చేసినందుకు ఈ నిరసనలు సాగుతున్నాయి. ఈ ఆందోళన మౌంట్‍ రష్మోర్‍ పై ఉన్న ప్రతివ్యక్తి చిరునామాపై బహిరంగంగా దాడి చేయడమే అని వ్యాఖ్యానించారు.

వామపక్షీయులు మన వీరుల చరిత్రను, విలువలను చెరిపి వేసి మన పిల్లలకు సిద్ధాంత రహితులుగా బోధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్‍తో పాటు ఆయన భార్య మెలానియా కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సభకు వచ్చిన వేలాది మందిలో చాలామంది మాస్క్లు లేకుండా హాజరయ్యారు. ట్రంప్‍ రావడానికి కొన్ని గంటల ముందు ఆందోళన కారులు రష్మోర్‍ మెమోరియల్‍కు వెళ్లే దారిని కొంతసేపు నిర్బంధించారు. ఈ సందర్భంగా 15 మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు.