PM Modi greets President Trump on 244th Independence Day of US

జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍కు, ఆ దేశ ప్రజలకు 244వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అని మోదీ ట్వీట్‍ చేశారు. భారత్‍, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ, మానవ భాగస్వామ్యాలను పెంచి పోషిస్తామని చాటుతూ జరుపుకునేదే స్వాతంత్య్ర దినోత్సవం అని మోదీ అభివర్ణించారు.