Coronavirus Positive Cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1,850 పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. వీటిలో గ్రేటర్‍ హైదరాబాద్‍ పరిధిలోనే 1,572 కేసులున్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 6,427 నమూనాలను పరీక్షించినట్టు రాష్ట్ర వైద్యరోగ్యశాఖ పేర్కొంది. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 22,312కు చేరాయి. 11,537 మంది కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్‍ కేసులు 10,487 ఉన్నాయి. శనివారం ఐదుగురి మృతితో మొత్తం 288 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో 1,10,545 నమూనాలను పరీక్షించారు.